పుస్తక సంపద;- ...కవిత

 పాఠకులుగా నిరంతరం చదవాలి గొప్ప రచనలు..
కొత్త రూపు దిద్దుకుంటాయి మనలో ఆలోచనలు!
పుస్తక పఠనంతో పొందగల వ్యక్తిత్వ వికాసం...
దానితో ముడిపడును మానసిక ఉల్లాసం!
ఎందరో మేధావుల విలువైన అనుభవాలు...
పెంపొందించగలవు మనలో మంచి భావాలు!
సృజనాత్మకతతో కూడిన వ్యక్తీకరణలు...
చేయగలవు మనలో ఎన్నో సంస్కరణలు!
మంచి గ్రంథం జ్ఞాన సంపదకు నిలయం..
గ్రహించితే ప్రతి మనిషి ఒక  గ్రంథాలయం!
తీరిక సమయంలో పుస్తకాల సాంగత్యం...
ప్రకాశించును మనోవికాసం అనునిత్యం!
    
కామెంట్‌లు
Heenal Shah చెప్పారు…
Very thoughtful poem teacher 👌👌