ఉత్పలమాల
1.
నమ్మితి నా మనంబునను; నాట్యవినోదుడ నాగభూషణా!
యిమ్మహియందు నిన్ను శివ; యెప్పుడు భక్తిగవేడుచందు నే ,
రమ్మిటు నన్ను బ్రోవగను; రాజివ నేత్రుడ బోళ శంకరా!
యిమ్ముగ భక్తవత్సలుడ; యీశ్వర రాగదె జాలమేలరా! .
2. ఉత్పలమాల.
కొండన నుండె శంకరుడ; కోరి యు భక్తులు గొల్చుచుందురే!
గండపు దీప కాంతులను; కాంతలు జ్యోతులు బెట్టి వేడగన్ ,
చండిని గూడి మాదరికి; సంతస మొందగ చేర వచ్చియున్ ,
దండిగ భోగభాగ్యములు; తానిల వేడ్కగ నిచ్చి వెళ్ళునే .
3. చంపకమాల
దినదినమందు భక్తిగను; దీను లు నిన్నిల వేడు చుండగన్ ,
ఘనముగ పూజ జేయగను; గంగ మనోహర బ్రోవు మెప్పు డున్ ,
మనమున శంక లేకను నుమా ధవ నిన్నిలగొల్చె వారికిన్ ,
ధనమును నిచ్చె వేల్పుడవు; ధాత్రిని కోర్కెలు తీర్చె యీశ్వరా! .
4 . చంపకమాల
మునిజన వందితుండ విల ముగ్ధ వినోదుడ ముక్తిదాయకా;
మనమున గొల్చెవారికిల ; మాన్యము , ధాన్యము లెల్లనిత్తువే ,
జనములు చేరవచ్చెదరు; చాలగ భక్తులు కోర్కెదీరగన్ .
5. ఉత్పలమాల.
ముద్దుల విఘ్న రాయుడును; ముందుగ నిల్వగ మోదమొంద వే! ,
సద్దియు నన్నముద్దవిల; సర్వము జీవుల జీవ దాత వే! ,
పెద్దవు వేల్పువై నిలిచి; ప్రేమగ భక్తుల నేలుచుందువే!
కద్దులు దీర్చ నీవెగద; కంజదళాక్షుడ కావవేలరా! .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి