స్నేహం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 దరిచేరిన అనుబంధం స్నేహం.....
వెంట ఉండే ఆనందం స్నేహం.....
మనసు కొరుకునే హాయి స్నేహం......
వెలుగు నింపుకున్న రేయి స్నేహం......
ఓటమి ఎరుగని ఆట స్నేహం......
ఓదార్పుని ఇచ్చే మాట స్నేహం......
నమ్మకాన్ని పునాదిగా నిర్మించుకున్న మేడ స్నేహం......
ఎంత పరుగు తీసినా మనని విడిపోని నీడ స్నేహం......
చిలిపి సరదాల చిరు కోపం స్నేహం......
అంతులేని త్యాగాల ప్రతిరూపం స్నేహం......
నా అంటూ సాగే స్వార్ధం స్నేహం......
మనం అన్నపదానికి నిలువెత్తు అర్ధం స్నేహం......
సువాసనలు వెదజల్లే పన్నీరు స్నేహం.....
మూగబోయిన మాటల కన్నీరు స్నేహం......
ఏళ్లు మారినా ఎదగని వయసు స్నేహం.....
కల్మషం ఎరుగని పసి మనసు స్నేహం......
మన చేతికి అందివచ్చిన వరమే స్నేహం.....
మననే వెతుకుతూ చేరుకున్న తీరమే స్నేహం......


కామెంట్‌లు