సునంద భాషితం;వురిమళ్ల సునంద, ఖమ్మం
 
      నీతి...రీతి...
   *******
నీతి..రీతి  అనేవి మన ప్రవర్తనకు కొలమానాలు.
నీతి అనేది ఉన్నత ప్రమాణాలతో, విలువలతో మిళితమై ఉంటుంది,ఏది తప్పు ఏది ఒప్పు అనే విచక్షణా జ్ఞానంతో కూడి, ఆచరణ యోగ్యమైన సత్ప్రవర్తనా నియమావళినే నీతి అంటాం.
నీతి నియమాలు అనేవి  సంఘానికీ,వ్యక్తులకు ఉంటాయి.
కొందరు అంగబలం,అర్థబలం,పదవుల గర్వంతో నీతి తప్పి ప్రవర్తించడం చూస్తుంటాం.
వారి వల్లే అవినీతి పెరిగి అక్రమాలు జరుగుతూ ఉంటాయి.
ఇక రీతి అనేది వ్యక్తి నడవడిక, వైఖరి,పద్దతికి సంబంధించినది.
సరైన రీతి, నీతి నియమాలతో జీవితాన్ని కొనసాగించే వారికి సమాజంలో ఎల్లప్పుడూ గౌరవం గుర్తింపు లభిస్తాయి.
నీతి, రీతి అనేవి మనిషి అనే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి. ఏది సరిగా లేకపోయినా నాణెం చెల్లనట్టు మనిషి కూడా విలువ లేని నాణెం అవుతాడు.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు