ఫలప్రదం!!!;-సుమ
 పరీక్షలు జీవితంలో ఒక భాగం
అవే జీవిత సర్వస్వం కాదు
ఏ కృషి అయినా ఫలప్రదం అయితేనే
మనకు మహదానందం కలుగుతుంది
ఫలితాలు ప్రతికూలం కాగానే
ఆశల మేడలు కూలిపోతాయి
సున్నిత మనస్కులు కుంగిపోతారు
నిరాశ, నిస్ప్రుహలు రేకెత్తించే తుఫానులో
మనలో ఉన్న అద్భుత శక్తిని మరచిపోతాం
మనసును నిశ్చలం చేసుకుని
లోలోపలికి తొంగి చూడాలి
అంతర్యామి గీతాచార్యుడైపోతాడు
ఓర్పు,నిగ్రహం లేని వారి కృషి
ఎన్నడూ ఫలప్రదం కాదు
జీవితకాలంలో అనేక సంపదలున్నా
జీవితమనే సంపద కన్నా అవేవి ఎక్కువ కాదు
కష్టాలు,సమస్యలు మనోనిబ్బరానికి పరీక్షలు
అవి శాశ్వతం సమస్తం కానే కాదు
ఇది గ్రహిస్తే జీవితం ఫలప్రదమైనట్లే!!!కామెంట్‌లు