పాట ( మహిళా చైతన్యం) ;-నెల్లుట్ల సునీత
పల్లవి

మహిలోన మహిళ శక్తి సాటిలేనిదీ 
ప్రతి రంగంలోన ప్రతిభ చూపుతున్నదీ 
అవనిలో సగమైనా ఓర్పు వున్నదీ 
జీవితాన తను లేనిదే శూన్యమన్నదీ 

చరణం

కష్టపడే తత్వమును అలవర్చుకున్నావు 
త్యాగమనే జీవితాన్ని ఆస్వాధించినావు 
యంత్రమై ప్రతి నిమిషం శ్రమ ఒర్చుకున్నావు 
సమాజంలో ధీమాగా అడుగులు కదిపావు 
చైతన్యం నింపావు 

చరణం

చిరునవ్వుగ నట్టింట్లో సిరులు కురిపించావు 
చీకటి అజ్ఞానానికి వెలుగుల్ని పంచినావు 
ఇల్లాలిగ అత్త మామ సేవలు అందించినావు 
జగతి సృష్టికే నువు ఆదర్శమైనావు 
కీర్తి శిఖరమైనావు 

చరణం

సాటిలేని మేటి క్రీడకారిణిగా ఎదిగినావు 
సంఘంలో గౌరవాన్ని పుణికిపుచ్చుకున్నావు 
అబల కాదు సబలని నిరూపించుకున్నావు 
నిష్కల్మష భావంతో కలుపుకు పోతావు 
కలిసి మెలసి వుంటావు 
**********

కామెంట్‌లు