ప్రాణభయం @ కోరాడ నరసింహా రావు !

 ప్రాణభయానికి  పిల్లి  పులి లా విరుచుకుపడుతుంది అంటే.. 
ఏమో  అనుకున్నాను !
   ఈ ప్రాణ భయం ఎంతటికైనా తెగిస్తుందని ఇపుడే తెలుసు కుంటున్నాను... !
    ప్రాణ హాని తలపెట్ట జూస్తే...
ఆత్మరక్షణకోసం ప్రతిఘటించి 
చలి చీమ లన్నీ ఒక్కటై... 
   విష సర్పాన్ని చంపేస్తాయనీ 
విన్నాం... !
    కానీ ఒక కప్ప తనను మింగే యటానికొచ్చిన ఆపామునోటికి
తానుచిక్కకుండా దానితలనే...
తననోటచిక్కించుకునిదని ఆట కట్టిస్తూ  ఓ గొప్ప పాఠాన్నే చెబుతోంది !!
   ఆత్మస్తైర్యముంటే...,అర్భక  ప్రాణియైనా తనను అణగద్రొక్క జూచిన మదాంధులను చిత్తు చేసి... ఆట కట్టించ వచ్చని.... 
తానే ప్రత్యక్ష సోదాహరణమై 
తెలియజెపుతోంది... !!
     *******
కామెంట్‌లు