సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 నీరు... కన్నీరు..
*******
మన ఒంట్లో...కంట్లో ప్రవహించేది నీరే...
బతకడానికి కావాల్సింది నీరే.మనిషి బతకాలంటే దేహంలో తగినంత నీరు ఉండాల్సిందే.
ఒంట్లో నీరు దేహంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
సమయానికి నీరు దొరక్కపోతే ప్రాణం విలవిలలాడిపోతుంది.
ఒంట్లో నీరు ఎంత ముఖ్యమో కంట్లో నీరు అంతే ముఖ్యం.
కనురెప్పలు కదలడానికే కాదు కరుణామయ హృదయ స్పందనను తెలిపేవి కన్నీళ్లే.
కన్నీరు మన భావోద్వేగాల దీపిక.
 మన కష్టమే కాదు ఇతరుల కష్టాలు చూసి కళ్ళు చెమ్మగిల్లడం, కన్నీళ్ళు కార్చడం  మానవతా హృదయానికి నిదర్శనం.
 
మనిషి జీవితంలో నీరూ, కన్నీరూ రెండూ అత్యంత అవసరమైనవే...
అవే మనిషిని బతికించేవి.మనీషిగా జీవింప జేసేవి.
రెండింటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి.
దేహంలో  తగినంత నీరు ఆరోగ్యానికి సూచిక. స్పందించే కన్నీరు  సహృదయతకు ప్రతీక.
 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు