ఈ సృష్టిలో ప్రతి పండూ...
పువ్వూ... పక్షి... పశువూ
దేనికదే ప్రత్యేకం!...
ఒకటి ఘనమూ కాదు
ఒకటి హీనమూ కాదు.
మనుషులైనా అంతే!
రంగులోనూ రూపంలోనూ
ఎవరికి వారే విలక్షణం...
ఒకరు ఎక్కువ కాదు
ఒకరు తక్కువా కాదు
ఆ విషయాన్ని అందరూ గుర్తిస్తే...
వివేకంతో విచక్షణతో ఆలోచిస్తే
తొందరపడి నోరు జారే వారుండరు
ఎవరినీ బాధపెట్టే వారూ ఉండరు
ఆ మాటలకు నొచ్చుకునేవారూ ఉండరు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి