డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ ప్రతిభా పురస్కారం


 భారతీయ భాషా మంచ్ న్యూఢిల్లీ మరియు రివైవల్ ఎఫర్ట్స్  ఫర్ జనరల్  అవేకెనింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మే 7న శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్  జయంతి సందర్భంగా .... రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ ప్రతిభా పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుదు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు అందజేశారు.  సాహిత్యంలో విశిష్ట సేవలు అందిస్తున్న చిటికెన ఇట్టి పురస్కారం అందుకోవడం జరిగింది. వాతావరణం అనుకూలించనందున  సంస్థ వారు కొరియర్ ద్వారా  మెమెంటో, శాలువా, ప్రశంసాపత్రాన్ని పంపించగా వారి సూచన మేరకు మాతృ దినోత్సవం రోజున  తన మాతృమూర్తి చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా చిటికెన మాట్లాడుతూ.. తన సాహిత్య కృషిని గుర్తించి ప్రోత్సహిస్తున్న భారతీయ భాషా మంచ్ న్యూ ఢిల్లీ మరియు రిగార్డ్ సంస్థలకు హృదయపూర్వక ధన్యవాదములు  తెలియజేశారు.


కామెంట్‌లు