జగమంత కుటుంబం ;-ఎం. వి. ఉమాదేవి
అమ్మ నాన్న రూపాలు 
వెలిగే ప్రేమ దీపాలు 
అక్క అన్న చెల్లి తమ్ముడు 
రక్తబంధము చేవ్రాలు !

అవ్వా తాతలు ఆదర్శం 
అనుభవాలలో అవి దివ్యం 
పిన్ని బాబాయ్ మామ అత్తా 
పెదనాన్న పెదమ్మ ఆప్యాయం!

వదినలు మరుదులు ఉంటారు 
కష్టం సుఖం పంచుతారు 
కుటుంబమే ఒక బలిమియని 
ఋజువుచేస్తూ ఉంటారు !

ఉమ్మడికుటుంబ జీవితం 
ఆనాడు ఒక ఆవశ్యకత
సమిష్టి కార్యక్రమంలో 
లాభించే పని గణనీయత !


కామెంట్‌లు