పుడమికి పులకింత;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు,నెల్లూరు.
 సంద్రపు నీరు సూర్య తాపానికి 
ఆవిరిగా మారి, ఆకాశానికి చేరగా...
నింగిలోని నీలి మబ్బులు 
నల్లగ మారగా...
నింగి నీడన నేల
పైన కారు చీకట్లు కమ్మగా...
సుడిగుండాలై
చలిగాలులు చుట్టుముట్టగా...
ఆకాశం, అవనికి సందేశాన్ని పంపగా...
చిటపట చినుకులు 
మట్టిని తాకి చిందులు వేయగా...
చిరునవ్వల పూలు 
చిత్రంగా చిగురించగా...
నెమలి నాట్యమాడింది...
పుడమి పులకరించింది...


కామెంట్‌లు