జన్మఫలం (బాలగేయం );-కొత్తపల్లి ఉదయబాబు.
 అమ్మ నాన్నల ప్రేమకు నోచి
పాపగ జన్మ ఎత్తాను...
బోసినవ్వులతో... చిలిపి చేష్టలతో
ఆటపాటల అల్లరి తో అలరించాను...
అమ్మ రామాయణ కధలు చెప్పింది
నాన్న భారతపు నీతి నేర్పాడు
తాతయ్య భాగవత తత్వం చెప్పాడు
మాస్టారూ బ్రతుకుతెరువు బోధించారు
హితులు స్నేహితులై అలరించారు
మానవసేవయే మాధవ సేవని 
సాయచేసే చేతులే మిన్నయని
పరోపకారం ఇదం శరీరమని
తనకు తాను సుఖపడినా
తనవారిని సుఖపెట్టే జీవితం 
ఆత్మతృప్తినిచ్చే దేవాలయం...
అని నేర్చుకున్నది జీవితపాఠం.
దానాలన్నీ గొప్పవి అయినా
సంతృప్తి చెందే అన్నదానం గొప్పదని
ఎన్ని నేర్చినా విశ్వమంత గోళంలో
నేనో పరమాణువునని తెలుసుకుని
అనునిత్యం శోధిస్తున్నా...
ప్రగతివైపు అడుగులువేస్తున్నా...!!!
కామెంట్‌లు