"తానా అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి శ్రీ తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు"
 ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక "ఆజాదీకా అమృత మహోత్సవ్" ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా "అంతర్జాతీయ గేయ కవితల పోటీలు" నిర్వహించింది. 
ఈ పోటీలో సూళ్లూరుపేట పట్టణం, తిరుపతి జిల్లాకు చెందిన కవి శ్రీ తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు ఎంపికయ్యారు. మే  27, 28, 29 తేదీలలో జూమ్ లో    తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి వేదిక మీద శ్రీ కామేశ్వర రావు తమ గేయాన్ని పాడి  వినిపించబోతున్నారు.
నటన, నర్తన, నాట్య భంగిమల అభినయం  గురించి వర్ణిస్తూ, భావయుక్తంగా వారు రాసిన " నటన - నర్తన " అనే గేయం ఈ పోటీలో  ఎంపికయింది.
ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి,  తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 
అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే  ఈ "తానా గేయ తరంగాలు " కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. "యప్ టీవీ" ద్వారా అమెరికాతో  పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 
ఈ టీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది. 
సరళమైన భాషలో, సామాజిక స్పృహ కోసం రచనలు చేసే శ్రీ తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు గారు, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో, షార్, శ్రీహరికోట లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 42 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తితో ఎన్నో సామాజిక కవితలు, వివిధ అంశాలపై పద్యాలు వ్రాసి, వివిధ సాహితీ సమూహాల నుండి ఎన్నో అవార్డులు పొందారు.ప్రముఖులతో ప్రసంశలు అందుకున్నారు. 
ఈరోజు సూళ్లూరుపేట పట్టణ ఖ్యాతిని  ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన శ్రీ కామేశ్వర రావుని నగర పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు, బంధు, మిత్రులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
----------------------------------------
తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు
రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో, షార్, శ్రీహరికోట
సూళ్లూరుపేట /తిరుపతి
చరవాణి: 9441871767


కామెంట్‌లు