దీపాలు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

దీపాలు దీపాలు
ఇంట దీపాలు
మింట దీపాలు
నక్షత్ర దీపాలు
జేజి దీపాలు
దివ్య దీపాలు.
భవ్య దీపాలు
భాష దీపాలు
దేశ దీపాలు
మా ఇంటిదీపాలు
మా కంటిదీపాలు
చిన్న దీపాలకు 
చిరాయురస్తు
పెద్దదీపాలకు 
సదానమోస్తు !!

కామెంట్‌లు