అమ్మ అమృత కలశం;-డాక్టర్ కందేపు రాణీ ప్రసాద్- సిరిసిల్ల
పురిటి నొప్పుల తో పాటు కత్తి కోతల్నీ భరించి
పెంచడమే కాదు చదువు లోనూ తోడుంది
నడక నేర్పడం కాదు నిజాయితీ నడక నేర్పి
మంచితనం విలువలు వెంట పయనింప చేసే
అమ్మ, మా అమ్మ ఒక అమృత కలశం!

సదా నా వెంట ఉండి సరైన దారిలో నడిపిస్తూ
నా బిడ్డల భవిష్యత్తు కూ దారులు ఏర్పరుస్తా
నా అక్షర ప్రయాణానికి వెలుగు పూలు జల్లుతూ
నా కళా ప్రపంచం లో సృజన శిల్పి గా మారి న
అమ్మ, మా అమ్మ ఒక అమృత కలశం!

కామెంట్‌లు