నానీలు ;-ఎం. వి. ఉమాదేవి
 1)
ఆదిశంకరుల
సామాజిక చేతనా భావాలు 
నేటికీ 
నిత్యావసరాలు !
2)
కోపం ఎక్కువైతే 
బట్టలు ఉతికేస్తుందామె 
రెండు విధాల 
లాభం !
3)
పేదలకి 
బడే ఇష్టం 
మధ్యాహ్నభోజనమూ 
పిల్లలకి రక్షణ !
4)
బంగారం లాంటి 
వ్యాపారం 
అక్షయ తృతీయమీద 
నమ్మకం తో !
5)
దేవుడు వరమిచ్చినా 
పూజారివ్వడు 
ఏసి ఉన్నా 
పవర్ కట్ లు !
రైలు నానీలు 
6)
ఉద్యోగుల 
రోజువారీ ప్రయాణం 
కష్టసుఖాల కలబోతకి 
ఆస్కారం !
7)
కొందరు 
కక్కుర్తి కాంతారావులే
ఇళ్లలో 
రైల్వే దుప్పట్లు !
8)
క్యాంటిన్ 
ఆర్డర్ ఆలస్యం 
అర్జెంట్ గా 
పెరిగిన బీపీ షుగర్ !
9)
అడ్డాకుల బస్తా
 సీతాఫలాల గంపలు 
రైల్వే స్టేషన్లో 
గిరిజనమేళా !
10)
ఇళ్లలో కంటే 
ప్రయాణంలో టేస్టీ 
చిరుతిండి బేహారీ
చిరంజీవ !

కామెంట్‌లు