సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఆసక్తి..ఆచరణ..
    ******
 ఏది నేర్చుకోవాలన్నా మొదట మనలో ఉండాల్సింది ఆసక్తి. ఆ తర్వాత ఆచరణ.
ఆసక్తి ఉంటే సాధ్యం కానిది ఏది లేదు ఈ లోకంలో..
బాల్య దశ నుండే వారిలోని వివిధ ఆసక్తులను గమనిస్తూ ఉంటాం.
 ఒక్కొక్కరికి ఒక్కో వాటి పట్ల అమితమైన ఇష్టం, ఆసక్తి ఉంటాయి. వాటిలో మంచి ఆసక్తులను గమనించి, చెడు వైపు ఆకర్షితులు కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
మంచి విషయాలు వినేలా, నైతిక విలువలు పెంపొందేలా వారికి బాల్యం నుండే పురాణేతిహాసాల కథలు, వీరోచిత గాథలు వినిపించాలి.
ఎందుకంటే బాల్యం కల్మషం ఎరుగనిది. మనం చెప్పే,నేర్పే ప్రతి మాట, అంశం వారిని ప్రభావితం చేస్తుంది.
ఆచరణకు పాదులు వేస్తుంది.
తల్లి దండ్రుల తర్వాత అత్యంత సన్నిహితంగా మెలిగేది ఉపాధ్యాయులు. వారిలో నైతిక విలువలు పెంపొందేలా.. ఆచరణలో చూపించేలా ప్రయత్నం చేయాలి.
అప్పుడే పిల్లల్లో ఆసక్తులు  ఆచరణ రూపం దాల్చుతాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు