శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ

 లక్ష్మ అనే పదంకి అర్ధం చిహ్నం అని!లక్ష్మణ అన్నాకూడా చిహ్నం అనే అర్ధం. రాముడి తమ్ముడు లక్ష్మణుడు అనేక శుభచిహ్నాలతో పరిపూర్ణ మానవుడిగా కీర్తింపబడ్డాడు.శుభలక్షణాలున్న స్త్రీని లక్ష్మి అంటారు. లక్ష్మణుడి ద్వారా నిర్మింపబడ్డ నగరం లక్ష్మణనగరం క్రమంగా లఖనవ్ ఆపై లక్నో గా మారింది. మహాభారతం లోని లక్క ఇల్లు నే లాక్షాగృహంఅంటారు.వారణావత్ అనే ప్రాంతంలో ఇదిఉంది.అలహాబాద్ కి సమీపంలోని హండియా ప్రాంతం లో గంగాతటంపై ఇప్పటికి దాని శిధిలాలను చూడొచ్చు.  మహారాష్ట్రలో లాటూర్ నగరంఉంది.నిజాం ప్రాంతంకి చెందిన దీని ప్రాచీన నామం లట్టలూర్.రాష్ట్ర కూటులను  లట్టలూర్ పురాధీశులని పిల్చేవారు.అదే క్రమంగా లాతూర్ ఐంది.  గుజరాత్ లోని ఓభాగంని  లాట్ అని  అక్కడి బ్రాహ్మణులు తమను లాట్యాయన్ బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు.హిందీ లో లాట్ రెండో అర్ధం ఎత్తయిన మీనార్అని.కుతుబ్ మీనార్ తెలిసిందే!ఆంగ్లంలోని లార్డ్ శబ్దం హిందీ లో లాట్ సాబ్ గా వాడుకలోకి వచ్చింది. ఇక లామా టిబెట్ శబ్దం. మఠాధికారి అని అర్ధం. వారి గురువులు దలైలామా పంచన్ లామా! ఆంగ్లంలో రెడ్ టేపిజం అని అంటాం.ప్రభుత్వ ఆఫీసులో పత్రాలు ముఖ్య మైన కాగితాలు  ఎర్రపట్టీలున్న అట్టలో ప్రత్యేకంగా పెడతారు. ఈఫైల్స్ ని త్వరగా చూసి సమస్యలు పరిష్కరించకుండా  అలా ఉంచితే రెడ్ టేపిజం అని అంటారు. లావణ్యం అంటే అందంఅనే అర్ధం లో నేడు వాడుతున్నారు. అసలు ఆపదం అర్ధం ఉప్పదనం అని!నుదుట శరీరం పై ఉప్పు కనపడితే వ్యక్తి  అందం ఇనుమడిస్తుంది. అందుకే లావణ్యం  అంటాం. ఇక లాస్యం అంటే నృత్యం  క్రీడ అంటారు. నాట్యం లో లాస్యం తాండవం రెండు రకాలు. కోమల భావభంగిమలను మధుర భావాల్ని ప్రదర్శించడం నే లాస్యం  అంటారు. 🌹
కామెంట్‌లు