దేశానికి ఎల్లలు (బాల గేయం);-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చిట్టి పొట్టి పిల్లలు 
చిన్నారి మొగ్గలు
ఆకుచాటు పిందెలు
అమ్మ ఒడిలో పాపలు

కల్లా కపట మెరుగని
రెక్కలిప్పి ఎగిరే
చిన్నారి పక్షులు
దేశానికెల్లలు వారు

ఆట పాటల తోటి
అలరించే పాపలు
అమ్మ నాన్నలకెప్పుడు
ఇంట్లో వెలిగే జ్యోతులు

నాన్నచెంత బుడతలు
బడికి వెళ్లే పిల్లలు
గురువు ముందు వారు
వాణి తల్లి కుసుమాలు


కామెంట్‌లు