మాతృబాష;-డా.నీలం స్వాతి--చిన్న చెరుకూరు గ్రామం,--నెల్లూరు.
 చినుకమ్మ గిలిగింతల భాష
చేనమ్మ తుళ్ళింతల భాష
వెన్నెలమ్మ చల్లని భాష
పూల కొమ్మ నవ్వుల భాష
అమ్మ చేతి గోరుముద్దల భాష
ఎల్లలులేని సరి హద్దుల భాష
తాతల నాటి తరాల భాష
పదాలు పలికిన స్వరాల భాష
ఒడి నేర్పిన విలువైన భాష
బడి నేర్పిన బంగారు భాష
వీచే గాలుల భాష
నింగీ నేలల భాష
కదిలే అలల భాష
కన్నీటి కలల భాష
సాగే వాగులమ్మ భాష
కూ కూ కోయిలమ్మ భాష
అందమైన బాష…అందరి భాష
మనసు భాష…మన మాతృ భాష...


కామెంట్‌లు