‌‌ బంగారు పూత!!?; - ప్రతాప్ కౌటిళ్యా
గుర్తించబడటం
కీర్తించబడటానికీ
సమయం సరిపోని గడ్డిపూవ్వు
యుగయుగాలుగా పూస్తూనే ఉంది
తాజాగా సమయాన్ని సవాలు చేస్తూ!!!

ఎవరికోసం ఆకాశం వేచి ఉంది
సరిరానీ పరిసరాలు ప్రకృతి వళ్ళు విరుచుకుని
ఆకాశం కేసి చూస్తేనేమీ
నేస్తం కాలేకపోయింది!!?

ప్రాణం పుట్టిందని  భూమి
బిగ్గరగా అరిస్తే నేమి
బల్లున తెల్లారిన
ఉదయాన్ని ఆపలేకపోయింది!!?

ఒక గూడు కోసం గువ్వ పుట్టలేదు
గూడు పుట్టలేదు
గడుస్తున్న ఘడియల కోసం
గడియారం పుట్టినట్లు
తొలుస్తున్న వేడి కోసం ఒడి లేక
ఒళ్ళు దాచుకోవడం కోసం
తోడుగా గూడు పుట్టింది!!?

పాదాల్ని రెక్కలు గా మార్చిన కోతి
ఎగుర లేకపోయింది
అతి పురాతన పక్షి ఎగిరింది నడిచింది
గెలిచిందెవరు!!?

నాలుకల్నీ నాటితే మాటలు పుట్టినట్లు
ఇటుకలు పేర్చి
మమ్మీలను పిరమిడ్లను కట్టినట్లు
రుజువులు ఉన్నవి
వాటి ఆస్తులు అస్తిపంజరాలు
మాటల కోట్ల ఆస్తులు అక్షరాలు!!?

ఎగిరిన ప్రతిదీ ప్రత్యేకమైనదే అయితే
మిణుగురు పురుగు కూడా ఎగురుతున్నది
దారంతావెలుగుతోంది!!?

బండను పగలగొట్టిన చేతులు
కండ బలానికి జోడించబడవు
దండకారణ్య లను కూడా
దండించ గలవు!!?

కాళ్లు కలిసి కదిలితేనే
ఒళ్ళు పలుచబడవు
కాస్త కళ్ళు కూడా పని చేయాలి!!?

శిల్పాలు చెక్క డానికి
రాళ్ళు రప్పలే కాదు
నిప్పురవ్వ లో కరుగుతున్న ఇనుము ఇత్తడి కూడా పనికొస్తుంది!!?

ప్రతిదీ వెండి బంగారం కావాలంటే
ఆకుల్లా చెట్లకు కాయాల్సిన అవసరం లేదు
రేకులకు బంగారు పూత పూస్తే
సరిపోతుంది!!?

Dedicated to my beloved Latha
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273

కామెంట్‌లు