సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
 నొచ్చుకునేలా.. మెచ్చుకునేలా...
******
మనమేంటో ఎదుటివారు అంచనా వేసేది కట్టుకున్న బట్టలనో వేసుకున్న నగలనో ఆస్తినో అంతస్తునో కళనో మరేవో కాదు.
చూడగానే అవెంత ఆకర్షణీయంగా కనిపించినా.. అవి కేవలం తాత్కాలికమే...
మన నోటిలోంచి వచ్చే మాటలే మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తాయి. బంధాల్ని గట్టి పరుస్తాయి.అభిమాన గౌరవాలు మాటల వల్లే లభిస్తాయి.
మనసు నొచ్చుకునేలా మాట్లాడే మాటలు..ఎదుటి వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.ఎంత కావలసిన వారైనా నెమ్మది నెమ్మదిగా అలాంటి వారికి దూరంగా జరిగిపోయేలా చేస్తాయి.
ఇక ఇతరుల మనసులను  హత్తుకునేలా మృదువుగా  ఉండే మాటలను ఎవరైనా సరే మెచ్చుకుంటారు...
అలాంటి వారికి  సమాజంలో ఇక తిరుగులేదు. ఎందరో అభిమానులు,ఆత్మీయుల గౌరవాన్ని సదా పొంది ఎదుటి వారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు.
 కాబట్టి.. మనం మాట్లాడే మాటలు నొచ్చుకునేలా కాకుండా  పదుగురు మెచ్చుకునేలా ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏



కామెంట్‌లు