హబ్బాఖతూన్! సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆమె దాదాపు 500ఏళ్ల క్రితం జీవించిన కాశ్మీర్ రాణి.ఆమె కవయిత్రి గాయని.కాశ్మీరు రేడియో లో సామాన్య జనం హాయిగా ఆమె రాసిన పాటలు పాడుతూ ఆనందిస్తారు.హబ్బా ఖతూన్ అసలుపేరు జూన్.కాశ్మీర్ లోయలో హిందూ ముస్లిం పిల్లల పేరు ఇదే.1579_1589లో కాశ్మీర్ పాలకుడు యూసఫ్ షా చాక్ కిభార్య.చందహార్ అనే పల్లెలో పుట్టిన ఈమె సామాన్య కుటుంబంకి చెందింది.ఖురాన్ తోపాటు పర్షియన్ కవితలు చదివి తన కమ్మని కంఠంతో కమ్మగా పాడేది ఈకాశ్మీరీ కోకిల.భలే అందగత్తె!ఓసామాన్యకుర్రాడితో 13వ ఏట వివాహం ఐంది.పొలంపనులు కుంకుమ పువ్వు తోటల్లో పనిచేస్తూ గొంతెత్తి పాడితే అంతా పరవశించేవారు.అలా షికారు కొచ్చిన రాజు ఆమెను భార్యగా స్వీకరించాడు.కాశ్మీరీభాషలో జూన్ అంటే చంద్రుడు అని అర్ధం.ఆమెజీవితం పూలనావలా.సాగింది.
కానీ అక్బర్ ఆమె భర్త ను బందీచేసి బీహార్ కి పంపాడు.పాపంఆమె  భర్త ఎడబాటు తోపిచ్చిదానిగా మారింది. గుల్మర్గ్ ప్రాంతంలో విషాద గీతాలు ఆలపిస్తూ"నాచేతులకు గోరింటాకు పెట్టా.ఆ   
యన ఎప్పుడు వస్తాడు?" అని ప్రశ్నిస్తూ కాశ్మీర్ లోయలో తిరిగి
పండాచోక్ లో చనిపోయింది.ఈమె సామాన్య జనుల సుఖదుఃఖాలని తన కవితల్లో చిత్రీకరించింది.దురదృష్ట విధి వంచితురాలు హబ్బా ఇంకా పల్లెవాసుల గుండె లో పదిలంగా నిలిచింది🌹
కామెంట్‌లు