నింగికి నీలి మబ్బులు బరువయ్యేనా....
చినుకు చేరక చేను గుండె చెరువయ్యేనా....
పచ్చికలో పచ్చదనమే కరువయ్యేనా....
మానుకు ఎండిన మట్టే ఎరువయ్యేనా....
ఎటు చూసినా ఎండమావులే ఎదురయ్యేనా....
కాల్చే కాలుష్యం కనుమరుగయ్యేనా....
మనిషికి మానవత్వం
ఇకనైనా మెరుగయ్యేనా....
నిరీక్షణ నెరవేరేనా...
పరిరక్షణ పట్టాలెక్కేనా...
ఆకాశం అలక తీరేనా...
మబ్బు మనసు మారేనా...
మట్టి వాసన రమ్మని పిలిచేనా...
జడివాన జాడను విడిచేనా...
చినుకు చేరగా చిగురు చిగురించి
వగలు పూయించేనా...
.
చినుకు చేరక చేను గుండె చెరువయ్యేనా....
పచ్చికలో పచ్చదనమే కరువయ్యేనా....
మానుకు ఎండిన మట్టే ఎరువయ్యేనా....
ఎటు చూసినా ఎండమావులే ఎదురయ్యేనా....
కాల్చే కాలుష్యం కనుమరుగయ్యేనా....
మనిషికి మానవత్వం
ఇకనైనా మెరుగయ్యేనా....
నిరీక్షణ నెరవేరేనా...
పరిరక్షణ పట్టాలెక్కేనా...
ఆకాశం అలక తీరేనా...
మబ్బు మనసు మారేనా...
మట్టి వాసన రమ్మని పిలిచేనా...
జడివాన జాడను విడిచేనా...
చినుకు చేరగా చిగురు చిగురించి
వగలు పూయించేనా...
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి