నేనొక చెట్టునై...!;-కొత్తపల్లి ఉదయబాబు.

 మొలకగా తలయెత్తి
మొక్కగా ఎదిగి
చెట్టుగా మలిగి
వృక్షంలా బ్రతకడం
ఎంతటి అదృష్టం...
పూలు పూచి, కాయలు కాచి
పళ్లైరాలిపోయినా
చెట్టు అందరూ ఉన్న ఒంటరి.
మనిషికి ఆజన్మంతపు సహచరి.
మనిషిగా చనిపోయి బ్రతకడం కన్నా
వృక్షంగా బ్రతికి కట్టెలో కట్టేలా
కాలిపోవడం మిన్న!!!
కామెంట్‌లు