సంపద సర్వమూ త్యజించిన
యోగిలా... తపిస్తున్నదీ
తరువు !
పరోపకారార్ధ మిదం శరీరం !
అందుకు ప్రత్యక్ష నిదర్శనమిది,
తనసర్వశక్తులూ...ధారపోసిఆర్జించినదంతా... ఉదారంగా పం చిపెట్టే త్యాగనిరతి తనది !
ప్రతిఫలాన్ని ఆశించని నిష్కామ కర్మయోగి తను !
తపః ఫలమంతా వితరణతో
తరిగిపోగా,చల్లనినీడను,ప్రాణ
వాయువునూ,సకాల వర్షా ల నూ...మరల-మరల అందించగ
ధ్యానముద్ర యోగముతో..... జపము చేయుచున్నది !
జన్మమెత్తినందుకు తన జీవి తమును సార్ధక మొనరించు టకై.... !
తెలుసుకోండి మనుషులారా
ఈ చెట్టు సందేశం !ఇచ్చుటలోనే యున్నది అసలు,
సిసలు ఆనందం !జన్మకిదే సార్ధకం !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి