శబ్ద సంస్కృతి! సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 దేశ్ముఖ్ అనేది నిజానికి మరాఠీ శబ్దం. జిల్లాధికారి అంటే నేటి కలెక్టర్ అని చెప్పవచ్చు. శివాజీకాలంలో పరగణా అధికారిని దేశ్ముఖ్ అనేవారు. 
దేశాయ్ అనేపదం మరాఠీ గుజరాతీలో ఉంది. దేశస్వామి క్రమంగా దేశసాయి ఆపై దేశాయ్ గా వాడుకలోకి వచ్చింది. పరగణా అధికారి అని అర్థం. కర్ణాటకలో వాడుకలో ఉంది. దేశ్ముఖ్ కి పర్యాయవాచి శబ్దం. 
ధాత్రీవిద్య అంటే గర్భవతి ని ఎలా ప్రసన్నంగా సంతోషంగా ఉంచాలి ఆపైబాలింత శిశువులను ఎలా జాగ్రత్తగా చూడాలి అని తెలియజెప్పే శాస్త్రం!నేటి పరిభాషలో మిడ్వైఫరీ మంత్రసాని చేసే పనులు తెలియజెప్పే శాస్త్రం అన్నమాట!
ధారోష్ణ అంటే ఆవు గేదె పొదుగునుంచి అప్పుడే పితికిన పాలు వెచ్చదనం కల్గిఉండటంవల్ల ఆయుర్వేదంలో ఆపాలు అమృతం తో సమానం అని చెప్పటం జరిగింది. మనం గుమ్మపాలుఅంటాం.పుష్టిని త్రిదోషహారిణి అని చెప్పారు. చిన్నికృష్ణుడు గోపబాలురు గుమ్మపాలు మీగడ వెన్న తినేవారు. దాని అర్ధం పిల్లలకి  ఆపదార్ధాలు బాల్యం నించి పెడితే దైహిక మానసిక వికాసం కలుగుతుంది అని. 
బెంగాల్ లోఒకప్పటి ప్రసిద్ధ నగరం. లక్ష్మణసేన్ అనే రాజు రాజధానిగా విలసిల్లింది. గంగానదిమధ్యలో ఇసుక గుట్టపై 9పల్లెలుండేవి.వాటిని  నవద్వీప్ అనేవారు. అదే నేటి  నదియా పట్టణం!
నహఛూ అనే సంప్రదాయం నార్త్ ఇండియా లో ఉండేది. వివాహంకి ముందు వరునికి తలక్షవరం గోళ్ళు కత్తిరించటం  ఆపై గోరింటాకు పెట్టడం తప్పక ఆచరించే వారు. అలాగే వధువుకి గోళ్ళు తప్పక కత్తిరించి స్నానం చేయించి  అలంకరిస్తారు. 
సంస్కృతంలో ని నాయక అనే శబ్దం  మలయాళంలో నాయర్ గామారింది.వీరిపేర్లు మీనన్ కురుప్ నంబియార్ పణిక్కర్  మొదలైనవి.వ్యవసాయం క్షురకుని ధోభీ చేసేటటువంటి పనులు నాయర్ లు చేసేవారు. వీరు యుద్ధవిద్యలో ఆరితేరిన పోరాట జాతి గా  పేరు గాంచారు.

కామెంట్‌లు