కౌసల్య.పురాణ బేతాళ కథ..;-డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు కౌసల్య గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా కౌసల్య రామాయణంలో దశరథుని ముగ్గురు భార్యలలో పెద్దది, అయోధ్య రాజ్యానికి మహారాణి. ఆమె మగథ సామ్రాజ్యపు (కోసల) రాకుమారి. ఆమె తల్లిదండ్రులు సుకౌశలుడు, అమృత ప్రభ. దశరథుడు మొదటగా సుకౌశలుడిని మిత్ర రాజ్యంగా ఉండమని ఆహ్వానించాడు. అయితే ఆయన అందుకు అంగీకరించలేదు. దాంతో దశరథుడు అతని మీద దండెత్తి అతన్ని ఓడించాడు. దాంతో సుకౌశలుడు తన కుమార్తెను దశరథుడికిచ్చి వివాహం చేసి సంధి చేసుకున్నాడు.
ఈమె శ్రీరాముని తల్లి. వాల్మీకి ఆమెకు రామజనని గా, కౌసల్యామాతగా గౌరవించాడు. ఇక్ష్వాకు వంశంలో తరతరాలుగా శ్రీమహావిష్ణువును ఆరాధిస్తుంటే, ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందే అదృష్టం కౌసల్య, దశరథులకు దక్కింది.
శ్రీ విళంబి నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి, శుక్ల పక్షం, పునర్వసూ నక్షత్రాన, కర్కాటక లగ్నంలో సూర్య వంశజుడైన రఘుకుల తిలకుని కౌసల్య ప్రసవించింది 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు