ముసుగులు తొలుగుతున్నాయి
అసలు రంగుల రాజకీయాల
కౌగిలింతలు మొదలయ్యాయి.
ఏ సభ అయినా చాలు,
తిష్ఠ వేసుకొని కూర్చుంటే చాలు.
కులమో,మతమో,
ప్రాంతమో,అవసరమో,
అవకాశమో,
అందిపుచ్చుకోవడమే అసలైన ఆట.
నేర్పు,ఓర్పులతో సీనియర్లు,
దూకుడు,జోకుడులతో జూనియర్లు,
దారులు వేరైనా గమ్యమొక్కటే.
డబ్బు,అధికారాలే లక్ష్యాలై,
దౌర్జన్యం,బలిమిలే సాధనాలై,
పీఠాలపై క్షుద్రకులు కొలువుదీరుతున్నారు.
సందేహమే లేదు......
ప్రజాస్వామ్యం అంతకంతకు
బలవత్తరమై,
ప్రజలను పక్కన పెడుతున్నది.
పథకాల ముక్కలు వేసి,
తాయిలాల తీర్థం పోసి,
విందుభోజనం పసందుగా పెట్టి,
హాయిగా జోలపాడి నిద్రపుచ్చుతున్నారు.
గాఢనిద్ర వదిలేదెప్పుడో?
రాజకీయ ఉగ్రవాదం అంతమయ్యేదెప్పుడో?
శుభోదయమయ్యేదెప్పుడో?
అసలు రంగుల రాజకీయాల
కౌగిలింతలు మొదలయ్యాయి.
ఏ సభ అయినా చాలు,
తిష్ఠ వేసుకొని కూర్చుంటే చాలు.
కులమో,మతమో,
ప్రాంతమో,అవసరమో,
అవకాశమో,
అందిపుచ్చుకోవడమే అసలైన ఆట.
నేర్పు,ఓర్పులతో సీనియర్లు,
దూకుడు,జోకుడులతో జూనియర్లు,
దారులు వేరైనా గమ్యమొక్కటే.
డబ్బు,అధికారాలే లక్ష్యాలై,
దౌర్జన్యం,బలిమిలే సాధనాలై,
పీఠాలపై క్షుద్రకులు కొలువుదీరుతున్నారు.
సందేహమే లేదు......
ప్రజాస్వామ్యం అంతకంతకు
బలవత్తరమై,
ప్రజలను పక్కన పెడుతున్నది.
పథకాల ముక్కలు వేసి,
తాయిలాల తీర్థం పోసి,
విందుభోజనం పసందుగా పెట్టి,
హాయిగా జోలపాడి నిద్రపుచ్చుతున్నారు.
గాఢనిద్ర వదిలేదెప్పుడో?
రాజకీయ ఉగ్రవాదం అంతమయ్యేదెప్పుడో?
శుభోదయమయ్యేదెప్పుడో?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి