శ్రమైకజీవనం;-జెగ్గారి నిర్మల,-జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల , కొండపాక

 ఆ.వె
కార్మిక జనులెంత కష్టంబు జేసిన
కడుపు నిండకుండ కనగ యవని
చెమట నోడ్చి వారు చేసినా ఫలమేమి
బుద్ధి మీర కొనెరు కొద్దికూలి
ఆ.వె
ఎండవానలోన మొండి కష్టముజేసి
ఉండు వారునిలన యూరు బయట
కమ్మ గుడిసెలందు కాలంబు గడిపేరు
పిల్ల పాపతోని యెల్లవేళ
ఆ.వె
చెట్టు క్రింద పిల్ల పట్టిని విడిచియు
రాళ్ళు గొట్టు వారు రాత్రి పగలు
ఏమి సుఖము లేదునెంచగావారికి
కష్ట జీవికిలన కండ్ల నీళ్ళె

కామెంట్‌లు