సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
ప్రేమించు ..బ్రతికించు.
      *****
చుట్టూ ఉన్న  ప్రకృతినీ చూడు..మనకు ఎన్ని అందాలను బహూకరిస్తుందో...
 ఋతువులు,కాలాల వారీగా  మన బతకడం కోసం ఆనందం ఆరోగ్యం, మనోల్లాసం కోసం ఎన్నింటిని అందిస్తుందో...
 పంచభూతాల నిలయమైన ప్రకృతిలో పక్షులు, జంతువులు, గిరులు,తరులు..ఎన్ని వింతలు విశేషాలో.. కనువిందు చేసే సోయగాలో...
 ఆకులో ఆకునై అన్న మహా కవి పాటలా అందులో మమేకమైతే ఎంత ఆనందంగా ఉంటుందో.. అందుకే ప్రకృతిని ఆస్వాదించు..ప్రేమించు.. విఘాతం కలిగించే వారి చర్యలను ఖండించు.
 రేపటి తరం కోసం  సృష్టిలోని అందాలను ఆనందాలను బ్రతికించు..
ఇప్పటికే  ఓజోన్ పొర చిరిగి పోతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యుని అతినీలలోహిత కిరణాలు భూమిని తాకితే అనేక శారీరక వ్యాధులు వస్తాయని,సమస్త జీవరాశి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెపుతున్నారు.
ఈ వినాశనానికి కారణం మనిషే.
కాబట్టి మనసున్న మనిషిగా ప్రకృతిని ప్రేమిస్తూ అపూర్వమైన పంచభూతాల నిలయమైన సంపదలను జీవరాశులను బతికించుకుందాం..
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు