వెలుగుల దివిటీ;- ...విశ్వైక-సికింద్రాబాదు
 వృద్ధాప్యం ..
ఒక జీవన సంధ్యా సమయం 
ఎన్నో ఉదయాలను గాంచిన
అనుభూతుల సారం
వృద్ధాప్యం ..
అనివార్యపు మజిలీకి చివరి వీధి
అనుభవాల మణులు నిండిన గుప్తనిధి
వృద్ధాప్యం ..
ఒక పెద్ద బాలశిక్ష 
లౌకికాలౌకిక జ్ఞానసంపదల సంరక్ష
వృద్ధాప్యం ..
ఊహ తెలిసిన పసితనం 
సత్తువలుడిగిన బే‌లతనం
వృద్ధాప్యం ..
పేద వారినైనా, పెద్ద వారినైనా 
భేదం లేక పలుకరించే బంధువు
కష్టనష్టాలనెన్నో తనలో
ఇముడ్చుకున్న సింధువు
వృద్ధాప్యం ..
చరిత్రను చదివి 
వర్తమానాన్ని చూస్తూ 
భవిష్యత్తుకు దారి చూపిన
వెలుగుల దివిటీ 
పెద్దరికపు ఏనుగును 
తోలుతున్న మావటి
ఒకసారి గుర్తుతెచ్చుకో..
ఎన్ని కలత నిద్రలు పోయిందో అమ్మ 
నిన్ను నిన్నుగా చూసేందుకు
ఎన్ని కష్టాలకు ఎదురెళ్ళాడో నాన్న
నీకు ఈ స్థానం కల్పించేందుకు
కాబట్టి..
బ్రతుకునిచ్చి లాలించిన అమ్మకు
నేనున్నానని భరోసా కల్పించు
వేలు పట్టి నడక నేర్పించిన 
నాన్నకు నీ చేతివేళ్ళను అందించు
నీవెంత ఎదిగినా 
నీ చిరునామా వారేనని గుర్తించు
కాలప్రవాహంలో నీకు రాబోయే స్థానం అది 
భావితరాలకు ఆదర్శంగా నిలిచి ఆచరించు నీ విధి
                   

కామెంట్‌లు
Ramade kulakarni చెప్పారు…
Excellent vishwa
Ramade kulakarni చెప్పారు…
Excellent vishwa...