అలకనంద.పురాణ బేతాళ కథ..; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు అలకనందా గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా అలకనంద' నది హిమాలయాల లో పుట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రవహించే ఒక నది. ఇది అనగా ఈ నది దేవప్రయాగ వద్ద భగీరథ నదితో కలిసి గంగానదిగా పిలువబడుతూంది. అలకనంద నది బదరీనాథ్‌కు ఉత్తరంగా ఉంది. అవతల హిమాలయ కొండల మధ్య పుట్టి దేవప్రయాగ అనే వూరి వరకూ ‘అలకనంద’ అనే పేరుతోనే ప్రవహిస్తుంది. అయితే బద్రినాథ్‌కు చాలా దూరంలో గంగానది గంగోత్రి అనే చోట నేలమీదకు దిగి, అక్కడ నుంచి భాగీరథి అనే పేరుతో ముందుకు సాగివస్తుంది. అలాగే కేదార్‌నాథ్ దగ్గర భిలాంగన, మందాకిని అనే నదులు జన్మించాయి. అందులో భిలాంగన నది ముందుకు సాగివచ్చి తిహారి అనే టోట భాగీరథి నదిలో కలిసి పోతుంది. అక్కడినుంచి అది భాగీరథి అనే పేరుతో ముందుకు సాగిపోతుంది.
ఈ నది భగీరథ నదిని కలువక ముందే మరికొన్ని నదులతొ కలుస్తుంది. ఈ నది కిన్నేరసాని నదితో కలుస్తుంది ఇది కిన్నేరసాని నదితొ రుద్రప్రయాగ వద్ద కలస్తుంది. అంతేకాదు పిండారి నదితో కర్న ప్రయాగ వద్ద కలుస్తుంది. విస్ణు గంగ నదితో విస్ణు ప్రయాగ వద్ద కలుస్తుంది 
'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు