చమత్కారకుండ! అచ్యుతుని రాజ్యశ్రీ

 యుద్ధంలో కాలుపోగొట్టుకున్న ఆభటుడికి రాజు డబ్బు మూట ఇచ్చి సాగనంపాడు."ఈడబ్బుతో ఎద్దులజత కొని వ్యవసాయం చేస్తాను. గేదెల తో పాలవ్యాపారం సాగిస్తా"అని ఎన్నెన్నో ఊహించుకుంటూ భటుడు చీకటి పడటంతో ఓ పల్లెలో ఆగాడు.అది దొంగలు ఉండే పల్లె.ఓఇంటిముందు ఆగి తలుపు కొట్టాడు ఆవిషయం తెలీక. వాళ్ళు తలుపు తెరిచి అన్నంపెట్టి పడుకోటానికి చోటుచూపారు.అలిసిన అతను  పొట్ట లో తిండి పడగానే  గుర్రుకొట్టాడు.అతని డబ్బు సంచీ హాంఫట్ చేశారు. తెల్లారగానే వారి కి ధన్యవాదములు చెప్పి పయనమైనాడు.దారిలో  ఆభటుడికి ఆలోచన వచ్చింది "రాజు నాకు బాగా  డబ్బు ఇచ్చాడు కదా?కొంత ఆఇంటివారి పిల్లాడికి బహుమతి గా ఇస్తే బాగుంటుంది "అనుకుంటూ  సంచీవిప్పాడు.కానీ  అందులో డబ్బు మూట కనపడదు. వెంటనే ఆఇంటితలుపుతట్టి"అయ్యా! నాడబ్బు సంచీలో నాణాలు మాయమైనాయి.దయచేసి నావి నాకు ఇవ్వండి. మీపిల్లాడికి కొంత కానుక గా  ఇద్దామని వచ్చాను."అని దీనంగా అడిగాడు. ఆగృహస్థు పెద్దగా నవ్వి అన్నాడు " ఓరి పిచ్చోడా! మావృత్తియే దొంగతనం! ఇంక నిన్ను చంపకుండా వదిలినందుకు సంతోషించు". పాపం మనసులోనే  ఏడ్చుకుంటూ  మళ్ళీ  రాజు గారి దగ్గరకు వెళ్లి భోరుమన్నాడు."హు నీకు శారీరకబలంఉందికానీ బుద్ధి లేదయ్యా"అని తిట్టి "సరే నీకు విద్యకావాలా?అది ఎప్పుడూ  నిన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. చమత్కార కుండకావాలా?"రాజా ప్రశ్నకి "ప్రభూ!మంత్ర చమత్కారకుండ నే ఇవ్వండి "."సరే!ఈకుండ నీవు ఏదికోరితే అది ఇస్తుంది. ఇది పగలకుండా జాగ్రత్తగా కాపాడుకో"అని రాజు  చమత్కార కుండని ఇచ్చాడు. భటుడు దాన్ని తీసుకుని తిరిగి ఆదొంగ ఇంటితలుపు తట్టాడు."ఈకుండసాయంతో వీడిపై ప్రతీకారం తీర్చుకుంటా"అనుకున్నాడు."నీదగ్గర ఆచెత్త కుండతప్ప ఏమీలేదు. ఫోఫో"అని ధడాలున తలుపులు మూశాడు దొంగ. అంతే కసిగా భటుడు అరిచాడు " వీడిఇల్లు అగ్ని కి ఆహుతి కావాలి " అంతే!అది మండుతుంటే దూరం గా వెళ్లి  ఓబండీవాడు కనపడితే "బాబూ! నన్ను మాఊరికి తీసుకుని వెళ్లు"అన్నాడు. అతను ఆ ఊరివాడే కాబట్టి భటుని  ఇంట్లో దింపాడు.అనుకోకుండా వచ్చిన  అతనిని  చూసి భార్య పిల్లలు సంతోషించారు.ఆకుండ అడిగిన కోర్కెలు తీర్చేది కావటంతో మంచి ఇల్లు సామాన్లతో దర్జాగా బతుకు తున్న  భటుని చూసి కుళ్ళుబోతువాళ్లు ఓపన్నాగం పన్నారు. స్నేహం నటిస్తూ అతనికి  బాగా మద్యం అలవాటు చేశారు. భటుడు ఊటుగా తాగి తందనాలాడుతూ వారికి తన మంత్రాలకుండ రహస్యం చెప్పేశాడు.ఇంకేముంది!"నీవు  ఆకుండ నెత్తిన  పెట్టుకుని మాతో కలిసి డాన్స్ చెయ్యి"రెచ్చగొట్టడం ఆలస్యం  భటుడు  ఒంటికాలితో రెచ్చిపోయి ఎగరడం  ఆకుండ కాస్తా నేలపై పడి భళ్ళు మని బద్దలవటం ఆలస్యం  అతని భవంతి  సంపద మాయమైనాయి.అతన్ని హేళన చేసి వెక్కిరిస్తూ వెళ్ళి పోయారు అంతా! భోరుమని ఏడుస్తూ "విద్య అనేది ఎవరూ ఎత్తుకుపోలేని సంపద!అల్పబుద్ధితో తెలివితక్కువ గా కుండను కోరుకున్నాను"అని పశ్చాత్తాపం తో కుంగిపోయాడు🌹
కామెంట్‌లు