కలిసుండడమంటే....;-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 కలిసుండడమంటే దానర్థం
అబద్ధాలు చెప్పడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
దౌర్జన్యం చేయడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
నమ్మించి గొంతు కోయడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
మూలాలను చెరిపేయడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
ఆక్రమించుకోవడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
బెదిరించడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
అక్కడి పాట పాడడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
కళ్ళు పచ్చనెక్కడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
కాళ్ళ కింద భూమిని కబళించడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
సోదర ముసుగులో దోచుకోవడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
తల్లినే మోసం చేయడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
కలికాలాసురులై విధ్వంసం సృష్టించడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
సంస్కృతిని నామరూపాల్లేకుండా చేయాలనుకోవడం కాదు.
కలిసుండడమంటే దానర్థం
ధృతరాష్ట్ర కౌగిలి కానేరదు.
కలిసుండడమంటే దానర్థం
లాక్షాగృహంలో కాల్చడం కాదు.
ఖబడ్దార్! కలిసుండలేకపోతే ఖామోష్ గా వదిలి వెళ్ళిపోవాలి
కామెంట్‌లు