అమృత వర్షిణి అమ్మ;-నాగమణి రావులపాటి

 మాతృ దినోత్సవం సందర్బంగా
=======================
తల్లి భూమి కన్నా
భారమైనదే కాదు
బరువు బాద్యతలను
మోసే మహోన్నత
పాత్రధారి బిడ్డలను
తన రెక్కలకింద దాచి
పెంచి పోషించే వెలలేని
సేవకురాలు రెక్కలొచ్చి
తనను విడిచి ఎగిరిపోయినా
అణువంత కూడా 
చెదరని చిరునవ్వుతో
వాళ్ళ అబ్యుదయాన్ని
కోరుతూ కరిగే కర్పూరం
అమ్మ హృదయం 
ఎవరెన్ని చెప్పినా తనని
ఏమన్నా మనసులో
కల్మషం రానీయదు
మల్లెల సువాసన కన్నా
తెల్లనైన మనసున్న అమ్మ
అమ్మకు నగలక్కరలేదు
నాణ్యాలు వద్దు కేవలం
అమ్మా అనే కమ్మనైన
మాటకోసం తల్లడిల్లేదే
మాతృ హృదయం
అందుకే చరమాంకంలోకి
చేరిన మీ మాతృ దేవతకు
మీ అమూల్యమైన ప్రేమను
పంచి ఆమె వాత్సల్యానికి
పాత్రులై కొంతయినా
మాతృ రుణాన్ని తీర్చుకోండి
మాతృ దేవో భవః

కామెంట్‌లు