హరి, వాణీ, వాసు, రామూలు క్యారమ్స్ ఆడుతున్నారు. డబుల్స్ కాదు. ఎవరి ఆట వారిదే. ఎవరి సంపాదన వారిదే. హరి మంచి ఆటగాడు. చాలా కాయిన్స్ తానే కొడుతూ జోరు మీద ఉన్నాడు. వాసు చాలా వెనుకబడినాడు. వాసుకు కోపం వచ్చి, ", ఒరేయ్ రామూ! హరి తొండి ఆట ఆడుతున్నాడు. నాకు వీడితో ఆడటం ఇష్టం లేదు. పద లేచి వెళ్దాం." అన్నాడు. రాము వాసుతో పాటు ఆట మధ్యలో నుండి లేచి వెళ్ళాడు. విషయం తెలిసిన వాసు వాళ్ళ అమ్మ తిట్టింది. "ఒరేయ్ మొద్దూ! నువ్వు ఎవరితో కలవవు. పైగా వాళ్ళతో గొడవ పడి గ్రూపులు చేస్తావు. ఇది మంచి పద్ధతి కాదురా! అందరితో కలిసిమెలిసి ఉండాలి. సహన గుణం ఉండాలి." అంటూ దాని గురించి వివరించి చెప్పింది. అయినా మనోడు మారితే ఒట్టు.
వాసు తరచూ బయటికి వెళ్ళి స్నేహితులతో గంటల తరబడి ఆటలు ఆడి రావడం పరిపాటి. "ఒరేయ్ వాసూ! ఎక్కడైనా ఆడుకో గానీ మన ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రగుంట అనే ప్రాంతంలో ఆడవద్దు. అక్కడ గుడ్డేలుగు తిరుగుతుందట." అంది అమ్మ. అవును తన స్నేహితులు కూడా అన్నారు. ఎర్రగుంట వద్ద గుడ్డేలుగు తిరుగుతుందని. ఇంతకు గుడ్డేలుగు అంటే ఏమిటి? బహుశా దయ్యమేమో! అనుకున్నాడు వాసు. ఒకరోజు సోము జట్టు, రంగ జట్టు ఊరికి కిలోమీటరున్నర దూరంగా ఉన్న మైదానంలో సాయంత్రం క్రికెట్ ఆట ఆడుతున్నారు. వాసును సతీశ్ ఔట్ చేశాడు. "నేను ఒప్పుకోను. నేను ఔట్ కాలేదు." అన్నాడు వాసు. "లేదు నువ్వు ఔటే" అన్నాడు సతీశ్. వాసును సతీశ్ బలవంతంగా అక్కడ నుంచి తీసుకెళ్ళాడు. "నేను ఈ ఆట ఆడను. మీరు కూడా ఆడకండి." అని స్నేహితులను ఆజ్ఞాపించాడు వాసు. జయంత, సుమంత అనే వాసు స్నేహితులు కవలపిల్లలు వాసుతో వచ్చారు. ముగ్గురూ కలిసి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళారు. ఇంతలో జయంత, సుమంతల నాన్న బండి మీద వచ్చి, తన ఇద్దరు కొడుకులను అంత దూరం వెళ్ళినందుకు బాగా తిట్టి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధం అయినాడు. తనను కూడా తీసుకుని వెళ్ళమని వాసు బతిమాలితే "దుర్మార్గుడా! నా పిల్లలను ఎర్రగుంట దాకా తీసుకుని వస్తావా?" అంటూ తిట్టి వెళ్ళాడు.
బాబోయ్ ఎర్రగుంట. పైగా ఒక్కడినే. వాసుకు భయం వేస్తుంది. పక్షులు కిలకిలా రావాలతో గూళ్ళకు చేరుకుంటున్నాయి. దూరం మే మే అంటూ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ మే మే అనే శబ్దాలు వాసును మరింత భయపెడుతున్నాయి. బాగా ఏడుస్తున్నాడు. ఇంతలో తన భుజంపై ఎవరో చెయ్యి వేశారు. ఉలిక్కిపడి వెనక్కి చూశాడు వాసు. "ఒరేయ్ అన్నయ్యా! ఎందుకు ఇంత భయపడుతున్నావు?" అని అడిగింది సిరి. "గుడ్డేలుగు నా వీపు మీద చెయ్యి వేసిందేమో అని భయపడ్డాను." అన్నాడు వాసు. "గుడ్డేలుగు అంటే ఏమిటి?" అన్నది సిరి. "దయ్యం. అదిగో మే మే అని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎన్ని దయ్యాలు ఉన్నాయో!" అన్నాడు వాసు. "ఒరేయ్ పిరికి అన్నయ్యా! మే మే అంటూ వస్తున్న శబ్దాలు ఇళ్ళకు చేరడానికి వెళ్తున్న మేకలవి. గుడ్డేలుగు అంటే దయ్యం అని ఎవరు చెప్పారు? దయ్యాలు, భూతాలు అనేవి అసలే ఉండవు. గుడ్డేలుగు అంటే ఎలుగుబంటి. అయినా ఆ ఎలుగుబంటి ఇక్కడ తిరుగుతుంది అనేది చాలా రోజుల క్రితం ముచ్చట. ఈ మధ్య ఆ వార్తలే లేవు. కాబట్టి భయం లేదు. ఈ మాత్రం దానికే ఇంత భయపడ్డావా?" అంటూ ఫక్కున నవ్వింది సిరి. వాసు సిగ్గు పడ్డాడు. "మళ్ళీ ఆటల్లో ఎవరితో గొడవ పడ్డావురా? ఇంత దూరం వచ్చావు. ఈసారి ఎవరూ నీ వెంట రాలేదా? అయినా నీ యొక్క ఎవరితో కలవని స్వభావం ఎవరికీ నచ్చలేదేమో! నిన్ను దూరంగా ఉంచారు." అన్నది సిరి. "ఇంకెప్పుడూ ఎవరితో గొడవ పడను సిరీ! అందరితో కలిసి ఉంటాను. సహన గుణం అలవరచుకుంటాను." అన్నాడు వాసు. "శభాష్ అన్నయ్యా!" అంది సిరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి