అజీర్తి సమస్య వినడానికి చిన్నదిగా అనిపించినా, పొట్టలో
చాలా అసౌకర్యం వల్ల ఎటు తోచని
పరిస్థితి ఏర్పడుతుంది.
జిలకర రెండు స్పూన్లు, వాము లేక ఓమ రెండు స్పూన్లు, మరియు ధనియాలు నాలుగు స్పూన్లు తీసుకొని తగినన్ని
నీళ్లు పోసి బాగా మరిగించి, కొద్దిగా సైన్ధవ లవణం వేసి కలిపి చల్లార్చి
కొద్ది కొద్దిగా త్రాగాలి. పొట్టలోని
ఇబ్బంది పూర్తిగా తొలగి పోతుంది.
కడుపు నొప్పి కూడా పోతుంది.
గ్యాసు కూడా పోతుంది. ఆ తరువాత ఆకలి వేసినప్పుడు
తెలికైన ఆహారం తీసుకోవాలి.
కారం, మసాలాలు తినకూడదు.
జిలకర, వాము, ధనియాలు
వేయించి అన్నీ కలిపి పొడి చేసి
గోరువెచ్చని నీటితో కూడా త్రాగినా
కూడా అజీర్తి సమస్య పూర్తిగా తగ్గి పోతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి