సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 మాత్సర్యం... వాత్సల్యం
******
మాత్సర్యం అనేది ఈర్ష్య అసూయలతో కూడిన దుర్గుణం.
తనను మించి ఆస్తులు, అంతస్తులు ఎవరికీ ఉండకూడదనే స్వార్థం. తాను పొందలేనిది ఇతరులకూ అందకూడదనే  భయంకరమైన అసూయే మాత్సర్యం.
 అందుకే సుమతీ శతక కర్త ఖలునకు నిలువెల్లా విషం గదరా సుమతీ అన్నాడు.
మాత్సర్యము గల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వాత్సల్యం అనేది బిడ్డలపై తల్లి చూపే అనురాగం ఆప్యాయత, ప్రేమ.
మన మనసులో కూడా అలాంటి వాత్సల్య పూరితమైన హృదయ సంస్కారం  కలిగి ఉండాలి.
వాత్సల్యం మానవతా పరిమళం.సాటి వారు , సమస్త జీవుల పట్ల తల్లి ప్రేమ కలిగి ఎలాంటి కీడును, హానిని తలపెట్ట నీయదు.
ఇది మనిషిని మనీషిగా చేసే సద్గుణం.
వాత్సల్యం నిండుగా ఉన్న వ్యక్తులు మెండుగా అందరితో గౌరవింపబడతారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు