తెలుగు సాహిత్యంలో సంస్కృత భాషా ప్రభావం ;-- బెహరా ఉమామహేశ్వరరావు

  ‌ నన్నయ మహా కవి తెలుగులో మహాభారతం రాసినప్పటికీ, కొన్ని పద్యాలలో తెలుగు పదాల కంటే సంస్కృత పదాలే ఎక్కువగా కనిపిస్తాయి. దానికి ముఖ్య కారణం తెలుగు కంటే సంస్కృత భాషా ప్రభావం ఎక్కువగా ఉండడమేనని చెప్పుకో వచ్చును
సంస్కృతంలో భర్తృహరి వ్రాసిన "సుభాషితాలు", నీతి బోధకమగు గ్రంధమగుటచే ఇది కూడా తెలుగులోనికి అనువదింపబడింది.
     సంస్కృతములోని సుభాషిత త్రిశతి అను
పేరున  "నీతి-శృంగార-వైరాగ్య" మని భర్తృహరి  రచించాడు. ఇందులో మూడు వందల శ్లోకాలు‌ఉన్నాయి.ఇది నీతులతోకూడీన శుబోధకమగు గ్రంథ మగుటచే, సరళమైన శైలిలో ఉండుటచేతను, దీనిని ఏనుగు లక్ష్మణ కవి,
ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన అను ముగ్గురు కవులచే ఆంధ్రీకరింప బడింది. ఈ గ్రంధాలలో పుష్పగిరి తిమ్మన ఎలకూచి బాలసరస్వతి రచించిన గ్రంధాలు జటిలంగా సంస్కృత సంధిసమాసాల ప్రాబల్యం ఎక్కువగా ఉండుట చేత, జనాదరణ అంతగా పొంద లేకపోయాయి. ఏనుగు లక్ష్మణ కవి రచించిన పద్యాలు శుబోదకంగా, రమ్యముగా,
భావయుక్తంగా ఉండటం చేత, జనాదరణ పొందుతూ నేటికీ నిలిచి ఉన్నవి.
       అలాగే సంస్కృతంలో తొలుత రచింపబడిన కథా గ్రంథము, గుణాఢ్య  మహాకవి రాసిన   "బృహత్కథ"గ్రంథము.ఈ గ్రంధాన్ని విష్ణుశర్మ అనే పండితుడు తీసుకొని ఇందులో గల  కొన్ని కథలు  "పంచతంత్రం" అనే సంస్కృత గ్రంథంగా 5వ శతాబ్దంలో  రచించారు.
      పంచతంత్రము లోని కొన్ని కథలు తీసుకొని 14వ శతాబ్దములో నారాయణ కవి హితో పదేశమను గ్రంథాన్ని రచించాడు. దీనిని తెలుగున కొందరు కవులు గద్య పద్యాత్మికముగా అనువదించారు.
వారిలో దూబగుంట నారాయణ, బైచరాజు వెంకట నాధులు చెప్పుకోదగిన వారు.
     తరువాత తొలుత పరవస్తు చిన్నయ సూరి,
పంచతంత్రం లోని కొన్ని భాగాలను వచన రూపం ఇచ్చాడు. ఈయన 19వ శతాబ్దంలో జీవించాడు.
        చిన్నయ సూరి గద్యములో రాసిన  పంచతంత్రం  వచన శైలి  ఈ నాటి బాలలు చదవడానికి  జటిలంగా ఉంటుంది. 
      పంచ తంత్రం- (తదుపరి మరికొంత)
     
కామెంట్‌లు