:సాహితీ మల్లె మొల్ల ఎం. వి. ఉమాదేవి :నెల్లూరు
ఇష్టపదులు 

సామాన్య గృహమునను సాహితీ మూర్తిగా 
మొల్ల జనియించినది మల్లె విరిసినయట్లు 

పండితుల విమర్శలు పాటింపు గాదనుచు 
రామకథ వ్రాసినది రమ్యమౌ తీరునను 

అలతిపద మమరింపు నామెవిద్యగ తోచు 
అయిదురోజులలోనె అనితర సాద్యమ్ముగ

ప్రబంధములను జదివి ప్రతిసూత్రమును దెలిసి 
గురువులే లేకుండ గొప్పసాధన జేసె 

సహజమగు వర్ణనలు సాధ్వి సీతను గూర్చి 
జాతీయములు జేర్చి జనులు భళి యన వ్రాసె 

వాల్మీకి కావ్యమును వాసిగా నందించె 
తేనెధారలు బోలు తేటతెనుగును మలచె 

శ్రీకంఠ మల్లన్న శ్రీలు చెలిగెడి గురువు 
ఆత్మలో నిల్చితన కాశక్తి నిచ్చెనని 

ఆతుకూరి

మొల్లకు అంజలుల నొసగెదము 
విదుషీమణి ఘనతయె విశ్వమంతయు నిలిచె !!


కామెంట్‌లు