సునంద భాషితం;--వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఆదరణ.. అభినందన..
******
సాటి వారు బాధల్లో ఉన్నప్పుడు వాటిని ఉపశమింప జేయడానికి  చూపించే కారుణ్యాత్మక  హృదయ స్పందనే ఆదరణ.
కృప, జాలి,దయ దాక్షిణ్యాలతో కూడిన ఓ సాత్వికమైన భావనే ఆదరణ.
అది తోటి మనుషుల పట్లనే కాదు.. జంతువులు, ప్రకృతి, పంచభూతాలను పరిరక్షించుకునే విషయంలో కూడా వర్తిస్తుంది.
అభినందన అంటే ఇతరులు సాధించిన విజయాలు, చేస్తున్న మంచి పనులను  మనస్ఫూర్తిగా, నిజాయితీతో మెచ్చుకోవడం.
అది హృదయ ఔన్నత్యాన్ని చాటే గొప్ప గుణం.
అభినందనలతో ఇతరుల మనసులను గెలవవచ్చు.శ్రేయోభిలాషిగా గౌరవాన్ని పొందవచ్చు.
అభినందనలో అంతర్లీనంగా ఆదరించే హృదయం ఉంటుంది.అది ఇచ్చి పుచ్చుకునే వాళ్ళకు ఇద్దరికీ ఆనందాన్ని, లోపాలను సవరించుకొని మంచిగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆదరణ, అభినందన మానవీయ విలువలతో కూడిన వ్యక్తిత్వానికి నిదర్శనాలు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు