సునంద భాషితం;-వురిమళ్ల సునంద,ఖమ్మం
 అనుసరించు-ఆనందించు..
*******
అనుసరించడమంటే.. అనుకరణ కాదు. మనకు ఇష్టమైన వానిని మనస్ఫూర్తిగా ఆచరించడమే అనుసరించడం..
అలా అనుసరించడంలో  ఆనందం దొరకాలి, ఆత్మ తృప్తి కలగాలి.అందరి ప్రశంసలూ పొందగలగాలి.
అప్పుడే అనుసరణకు సార్థకత చేకూరుతుంది. మదిలో ఆనందం వెల్లివిరుస్తుంది.
 ముఖ్యంగా జీవితంలో
అనుసరించవలసినవి రెండు...ఒకటేమో పెద్ద వాళ్ళు అనుభవంతో చెప్పిన మంచి మాటలు, మరొకటి  కాలం.
మంచి మాటలతో పాటు..కాలం విలువ తెలుసుకుని,మన కోసం ఆగని సమయాన్ని  సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలి.
అలాంటి మంచి పనులు చేయడంలోనే ఆనందం దొరుకుతుంది.
 అందుకే ...మంచివైన ఆ రెంటిని అనుసరిద్దాం మానసికమైన తృప్తి, ఆనందాన్ని పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు