నవరస నటనా ధురీణ --ఇష్టపదులు --ఎం. వి. ఉమాదేవి
ఆజానుబాహుడుగ అరవింద నేత్రుడుగ
అన్నగా మిన్నగా అలరించి నటునిగా 

నందమూరి వంశము నాల్గు తరముల జూసి 
నవరసపు జీవితము నామూలముగ చూసి 

మెప్పులును తిట్లనిదె మేటిగా తలవంచి 
ఆత్మయోగము నొంది ఆయనే నిష్క్రమణ

మాట గంభీరతలు నోట నాప్యాయతలు 
చిన్నవారిని చేయి  చిరునవ్వుతో బట్టి 

బ్రదర్ పలకరింపుతో బ్రహ్మానందముగా 
నటులు కవులు మెచ్చిన నటనా ధురీణుడుగ

ఆ రాజసమెవరికి ఆ హుందా ఠీవిని 
ఎవ్వరికీలేదుగ ఎన్టీయారు కథా 

అభిమానధనుడిగా అట్టి సుయోధనుడుగ
కుంతి వదిలిన శిశువు కుమిలి పోయిన కర్ణ 

గుండమ్మ అల్లుడిగ గుర్తుగా మిస్సమ్మ 
కృష్ణ రాయలు తాను తృష్ణ తీరని నటన 

హిమగిరీ సొగసులను హీరోయిజమదేను 
మనిషి మారలేదూ మనను వీడలేదూ !!

తెలుగుదేశము పెట్టి తెగువతో పాలించి 
ఆడపడుచుకు నిచ్చె ఆస్తిహక్కులు తాను 

ఆత్మ గౌరవబాట ఆ కీర్తి పలుచోట
లేచి మహిళాలోక లేమల ప్రవేశము 

రాజకీయము చేసి రంగులను తుడిచేసి 
పోతులూరి కథలను పొoదికగ సినిమాయె

రామారావు లవకుశ రాముడయ్యే చూడు 
భీష్ముడై రావణుడు బీరుపోనిది బ్రతుకు !!

కామెంట్‌లు