వెన్నెల పాట ;-ఎం. వి. ఉమాదేవి
వెన్నెల్లో పాడుదాం 
చెమ్మ చెక్క లాడుదాం 
చందమామ కథలతో 
తారకలని చేరుదాం !

కుందుడుగుమ్మలాడదాం 
కోలాటం వేయుదం 
కొక్కొరొకో కోడిపుంజు 
కూతపెట్టి నవ్వుదాం!

తొక్కుడుబిళ్ల కొస్తారా 
పిక్కల బలం చూస్తారా 
అచ్చనగాయ ఆటలో 
హెచ్చును నేను అంటారా !? 

చికుచికుపుల్ల మట్టిలో 
పిచ్చుకగూళ్ళు ఇసకలో 
వానవానా వల్లప్పా 
కాగితం పడవలు వదులప్పా !


కామెంట్‌లు