సమ్మోహనం (ముక్త పదగ్రస్థo ); ఎం. వి. ఉమాదేవి
చిలుకలేమో రెండు 
రెండు కోరెను పండు 
పండునే చెరిసగం పంచుకొను ఓ వనజ !

పచ్చపచ్చని చిలుక 
చిలుక తీయగ కొరుక 
కొరికితే పండింక రుచికరం ఓ వనజ !

వంపు తిరిగిన ముక్కు 
ముక్కు చూడే టెక్కు 
టెక్కుగా అందాలు ఒలికించు ఓ వనజ 

తోటకే అందమిది 
అందమగు జంటఇది 
జంటకే జాంచెట్టు విందులే ఓ వనజ !
జామతరు వుండాలి 
ఉండి మరి కాయాలి 
కాసాక చిలుకలే వాలవా ఓ వనజ !!

కామెంట్‌లు