*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౮౮ - 088)*
 *దైవ పద్ధతి*
చంపకమాల:
*కలితవిపత్తిదండపద ఘట్టనసేయుచు మన్నుకైవడిన్*
*ఖలుఁడు విధాత పిండితముగా నొనరింవి నితాంతచింత యన్*
*బలితపుసారెపై నిలిపి పాయక డెందము ద్రిప్పుచున్నవాఁ*
*డలమి కూలాలురీతిఁ దెలి యం గలవారమె యేమిసేయునో?*
*తా:*
ఈ దైవం అసలు దయలేనివాడు. కుమ్మరి వారు చక్రము తిప్పుతూ మట్టి ముద్దను ఏరూపములో తయారు చేయాలి అనుకుంటున్నాడో, మట్టి ముద్దకు తెలియనీయడు కదా. అలాగే, ఈ దైవం కూడా మన మనసు అనే మట్టి ముద్దను తీసుకుని, కమ్మరి చక్రం లాంటి, కష్టాలు బాధలను ఆసరాగా తీసుకుని మనల్ని ఎటువైపుకు నడిపిస్తాడో! ఎన్న తప్పులు చేయిస్తాడో కదా! ఇలా ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియదు. ఇంకా ఏమేమి జరుగుతాయో!....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"పుటము వేస్తే గానీ పసురవేది తయారు అవదు" ఇది పెద్దల మాట. అందుకే మన పెద్దల చిన్నతనంలో గురుకులాలో విద్యను చదువుకునేటప్పుడు గురు శుస్రూష చేస్తూ, వారి కి కందమూలాలు ఏరి తీసుకుని వచ్చి వారు తిన్న తరువాత, భోజనం చేస్తూ, వారు నేర్పి నప్పుడు విద్య నేర్చుకునేవారు. మన చిన్నతనం లో మన తల్లి తండ్రలు కూడా పొరపాటున తప్పు ఒనులు చేసినా విషయం చెప్తూనే దండన కూడా గొప్పగా నే ఉండేది. ఈ అన్నిటి వెనకాలా, మనల్ని మన మార్గాన్ని మంచిదారివైపు మళ్ళిచడమే. అదేవిధంగా, మరి పరమాత్మ మనమందరి తండ్రి కదా! బిడ్డ చెడదారి పట్టకుండా తన దారిలోకి తెచ్చుకుని తన సన్నిధానంలో శాశ్వతంగా ఉంచుకోవాలి అనే ప్రయత్నం అను నిత్యం చేస్తూ వుంటాడు, పరమేశ్వరుడు ఎల్లప్పుడూ. అటువంటి దైవ శక్తి, భక్తి మనతోడు వుండాలని ప్రార్థిస్తూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు