*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౦౯౫ - 095)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శ్రీహరి కి సృష్టి ని రక్షించుతూ, భోగము మోక్షము లను ఇచ్చు అధికారమును ఇచ్చి సదాశివుడు అంతర్ధానం అగుట.*
*పరమశివుడు ఇంకా ఇలా చెప్తున్నాడు -  శ్రహరీ! నీవు మనుషులకు మీక్షము ప్రసాదిస్తావయ. భక్తుల చేత పూజింపబడుతూ వారి పూజ్యుడవై వుంటూ అందరి జీవులకూ నిగ్రహానుగ్రహములను ప్రసాదించు.*
*ఈ విధంగా విష్ణుమూర్తి తో పలికిన సదాశివుడు బ్రహ్మ నైన నన్ను, నా చేతిని విష్ణు దేవుని చేతిలో వుంచి, ఈతనికి (బ్రహ్మ కు) ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా అతని రక్ణకు నీవు వెళ్ళాలి. అందరికీ తలమానికమై వుండాలి. భోగము ఇచ్చే సంపదలూ, మోక్షము ఇవ్వు. అన్ని కోరికలనూ తీర్చగల వాడవు నీవే. నీ శరణు కోరిన వాడు నన్ను శరణు కోరినట్లే. మన ఇద్దరి లోనూ బేధము చూపే వాడు నిక్కచ్చిగా నరకానికి వెళతాడు.*
శ్లో:
*త్వాం యః సమాశ్రితో నూనం మామేవ సః సమాశ్రిత:!*
*అంతరం యశ్చ జానాతి నిరయే పతతి ధృవమ్!!*
                                         (శి.పు.రు.సృ.ఖం. 10/14)
*బ్రహ్మ: భగవానుడు అయిన సదాశివుడు చెప్పిన మాటలు విన్న విష్ణుమూర్తి సమస్త జగత్తు యొక్క ఆధిపత్యం స్వీకరించి, అందరికీ సకలైశ్వర్యములు అనే తన కర్తవ్యోన్ముఖుడు అయ్యి, శివునికి నమస్కరించి ఇలా చెప్పాడు విష్ణుమూర్తి - నేను నీ అధీనుడయి వుండి నీవు చెప్పిన ప్రతీ కార్యక్రమం చేస్తాను. నా భక్తుడయి నిన్ను నిందించేవారు నిశ్చయంగా నరకానికి పోతారు. నీ ప్రతి భక్తడూ నాకు అత్యంత ప్రియమైన వారు. వారికి భోగ మోక్షములు తప్పక దొరుకుతాయి. ఇది సత్యం. ఇదే సత్యం.*
*అందరి దుఃఖాన్ని హరించే హరుడు మా ఇద్దరినీ అమిత ఆదరమైన చూపులతో చూస్తూ మా ఇద్దరి శ్రేయస్సు కోరి మాకు అనేక వరములు ఇచ్చాడు. మేము చూస్తుండగానే ఆ స్వామి అంతర్ధానం అయ్యాడు. అప్పటి నుండి లింగరూపములో శివభగవానుడి పూజ మొదలైంది. లింగములో వున్న సదాశివుడు భోగములు, మోక్షము ప్రసాదిస్తున్నాడు. శివ లింగమునకు వుండే వేదిక అర్ఘా మహాదేవి స్వరూపము. లింగము సాక్షాత్తు మహేశ్వరుడే. లయ కారకుడు అయిన శివభగవానుని రూపమే శివలింగము. ఆ స్వామి యందే సకల జగత్తు లయమౌతుంది.*
*రేపటి నుండి "శివపూజా వుధానము - ఫలితాలు" తెలుసుకుందాము.*
*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు