"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 54,వ, బాగం)-- "నాగమణి రావులపాటి"
చిరుగాలికి లేత చిగురులు సుతారంగా కదలాడగా
ఆ చిగురులపై వీచే  పల్లవ వీచికల సువాసనలతో
మనసు ఆహ్లాద భరితమైన హృదయం ఆనంద
నందన భరితమవగా పులకించదా ప్రకృతి......!!

అక్క అడుగు జాడలే బ్రతుకు బాటలై ఆమె అందించే
ప్రేమాను రాగాలే పెన్నిధి గా మెదిలే మదిలో
కన్నె హృదయం పెళ్ళి మాట వినగానే  మానస
వీణ  కోటి రాగాలై మీటదా పూర్ణిమ స్తితి గతి తప్పి
సిగ్గుతో ముఖం ఎర్రబారదా ..!!అందంలో కుసుమ కు
తక్కువేమీ కాదు..................!!

గీత మాట్లాడటం మొదలు పెట్టింది ఈ సారి కాస్త
శ్రద్ద చూపింది పూర్ణిమ  పూర్ణిమకు ఇంతవరకు
పెళ్ళి ఆలోచన లేదు  కానీ అక్క గురించి ఆలోచించేది
పెళ్ళి చేసుకోమని అడిగే ధైర్యం లేదు అక్క ఎప్పుడూ
బిజినెస్ పైనా మాపైనే ఆరాటపడేది తన ఉనికిని
ఎప్పుడూ బయట పెట్టేది కాదు...........!!

కానీ గీత రాక తన పెళ్ళి ప్రస్తావన మనసును
కలవర  పరిచింది.. గీత స్పష్టంగా చెప్పింది తనకీ
తమ్ముడికీ వివాహాలయ్యాకే అక్క రాహుల్ గారిని
చేసుకుంటుందని... అందుకే కాస్త సిగ్గు బిడియం
నడుమ నలిగే హృదయం చిన్న నాటి వేణుని
ఊహించుకుని ఇప్పుడు ఎలా వుంటాడో ఏమో
ఎలా వుంటే ఏమి గీత వాళ్ళు ఇంటికే నేను కోడలిగా
అక్కకు ఆమోదమే కాక ఆనందం కూడా.......!!

ఆలోచనలు ముసిరిన వేళ గీత పలుకులు వేద
మంత్రాలై వినిపించగా పూర్ణిమా అన్న గీత పిలుపుకు
 ఈలోకం లోకి వచ్చింది పూర్ణిమ చెప్పవే వేణును
చేసుకోవటం నీకు సమ్మతమేనా ఇందులో బలవంతం
ఏమీ లేదు వైభవ్ కూడా ఇక్కడేవున్నాడు చెప్పవే నీకు ఇష్టం అయితే చెప్పు ఇంకా మిగిలిన విషయాలు 
మేము మాట్లాడు కుంటాం అని అన్నది గీత.......!!

పూర్ణిమ మనసు చిక్కబట్టుకుని  అక్క ఓకే అంటే
నాకేమీ అభ్యంతరం లేదు అని తూనీగలా సర్రున
మెట్లుదిగుతుంటే అప్పుడే పైకి వచ్చే కుసుమను
తప్పించుకుని తను గదిలోకి పరుగెత్తింది పూర్ణిమ.!!
ఏమిటే పూర్ణిమ అలా పరుగెడుతోంది ఏమన్నావు
దానిని అని నవ్వుతూ అడిగింది కుసుమ.......!!

ఏముంది పెళ్ళి ప్రస్తావన వస్తే ఏ ఆడపిల్ల కైనా సిగ్గే
కదా పుత్తడిబొమ్మ పూర్ణమ్మ పెళ్ళికూతురు అయింది.
వీడి ముందే అడిగాను...నీకు ఓకే ఐతే తనకేమీ
అభ్యంతరం లేదు అన్నదే అది అని అన్నది గీత....
కుసుమ కళ్ళలొ ఆనందం భాష్పాలు చెంపలను
ముద్దాడాయి..............!!

నాకు తెలుసు ఈ అక్కయ్య మాటకు విలువ
ఇస్తారని గీతా నేను అదృష్ట వంతురాలిని నా చెల్లి
పెళ్ళి గురించి నేను చాలా ఆందోళన పడ్డాను....

ఎలాంటి వాడు దొరుకుతాడో ఏమో అని నాకింకా
దిగులే లేదు అని తమ్ముడిని తల్లిలా అక్కున
చేర్చుకుని వీడికి కూడా మంచి అమ్మాయిని
చూడవే నాకింకా ఏ దిగులూ వుండదు అని అనే
సరికి వైభవ్ గీతల  కళ్ళల్లో నీళ్ళు సుడిగుండాలై
హృదయాలు బరువెక్కాయి(సశేషం)......!!

కామెంట్‌లు